ఏపీలో రాక్షస పాలన అంతం కావాలని విజయవాడ దుర్గమ్మను కోరుకున్నట్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలి. ఐక్యతతో ఉండాలి. ఏపీని రాక్షస పాలన నుంచి విముక్తి చేయడానికి వారాహి ద్వారా ప్రచారం చేపడుతున్నా’ అని దుర్గమ్మ దర్శనం అనంతరం పవన్ తెలిపారు. ఆ తర్వాత వారాహి వాహనంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పవన్ వెళ్లారు.
