ఏపీలో నకిలీ నోట్ల చలామణి కేసులో బొందిలి కార్పొరేషన్ ఛైర్పర్సన్ రజనీని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్ల చలామణికి సంబంధించి బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన రజని నుంచి రూ. 40 లక్షలు విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగనోట్ల ముఠాతో ఓ ఎమ్మెల్యేకు సంబంధం ఉందంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది.
