ఏపీకి చెందిన దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు పంపిన సంగతి విదితమే.
అయితే సీబీఐ పంపిన నోటీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి స్పందించారు. ‘నిన్న రాత్రి నోటీసులు పంపి ఇవాళ విచారణకు రమ్మంటే ఎలా? నేను 4 రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది.
అందుకే సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు గడువు కోరా. సీబీఐ మరో నోటీసు ఇస్తే అప్పుడు ఆలోచిస్తా. సీబీఐ విచారణకు పూర్తి సహకారం అందిస్తా’ అని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.