వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగే వరకు సాయంత్రం సమయంలో ఉచిత అల్పాహారం అందించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు.
హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే గారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలో ప్రతీ సంవత్సరం మన బడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సంవత్సరం నియోజకవర్గ పరిధిలో సుమారు 2400మంది విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్స్ లో ఉచిత అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని 30రోజులకు పైగా నిర్వహించేందుకు అవసరమైన నిధులను సంబంధిత విద్యా శాఖ అధికారులకు, హెడ్ మాస్టర్లకు అందించనున్నట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు. విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు.
ఈ కార్యక్రమం అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ సీఈవో కొయ్యల రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కాట్రోజు రాజు, మన బడి మన బాధ్యత కన్వీనర్ దోమ కుమార్, జడ్పిటీసి బానోత్ సింగ్ లాల్, కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.