ఏపీకి చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ గత కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న సంగతి విదితమే. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం నాడు జరుగుతున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు సైతం హాజరు కాలేదు.
రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పెదకూరపాడులో సమావేశాలు కొనసాగుతున్నాయి… అయితే ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ మాత్రం హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం. తన అనుచరులతో కలిసి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అటు బీజేపీ శ్రేణుల్లో ఇటు కన్నా వర్గంలో ఉత్కంఠ నెలకొంది.