ఏపీకి చెందిన దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై అధికార వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తొలిసారి స్పందించారు. ‘రెండున్నరేళ్లుగా నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
నాపై వచ్చిన అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నా. నేనేమిటో ప్రజలకు తెలుసు. న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలన్నదే నా ధ్యేయం. నిజం తేలాలని దేవుడ్ని కోరుకుంటున్నాను. ఆరోపణలు చేసేవారు ఆలోచించాలి. ఇలాంటి ఆరోపణలు చేస్తే మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీలవుతారో ఓ సారి ఆలోచించండి’ అని ఆయన ఈసందర్భంగా సూచించారు.