అక్షర నిర్మాన్ స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులోని రవీంద్రభారతి లో రాష్ట్రస్థాయి జీకే మహమేధా టాలెంట్ టెస్ట్ నిర్వహించగా సత్తుపల్లి టాలెంట్ స్కూల్ విద్యార్థులు దండమూడి లక్ష్మీదుర్గ స్టేట్ టాపర్ గా నిలిచి, రూ.10 వేల నగదు బహుమతి , షిల్డ్,ప్రశంసా పత్రమును అందుకుంది,అదేవిధముగా రాష్ట్రస్థాయి ప్రధమ బహుమతిని చక్రపు సహస్ర సాధించి సైకిల్ ,షీల్డ్, ప్రశంసా పత్రమును బహుమతిగా గెలుచుకుంది.
అంతేకాకుండా జలదాని తన్మాయ్ శ్రీజ,షేక్ పర్వీన్, ముదిగుండ్ల గీతాంజలిలకు కన్సోలేషన్ బహుమతులు, షీల్డ్ , ప్రశంసా పత్రమును అందుకున్నారు.రాష్ట్రస్థాయిలో టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించడంతో విషయం తెలుసుకున్న ఎం.ఎల్.ఏ సండ్ర వెంకటవీరయ్య సోమవారం టాలెంట్ స్కూల్ ను సందర్శించి విద్యార్థులను శాలువాతో సన్మానించి అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించడం ఆనందంగా ఉందని విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ, పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షలను తట్టుకునే విధంగా వారిలో మేధస్సును నింపిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ కూసంపూడి మహేష్, జడ్పిటిసి కూసంపూడి రామారావు, పట్టణ కార్యదర్శి మల్లూరి అంకమరాజు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దొడ్డా శంకర్రావు, పాఠశాల కరస్పాండెంట్ పులి అరుణ , ప్రిన్సిపాల్ పులి శ్రీనివాసరావు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.