ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు ఉంటే మంచిదేనని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే తన కొడుక్కి టికెట్ అడుగుతున్నామని తెలిపారు.
టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ చేయమని చెబితే అక్కడి నుంచి తన కుమారుడు బరిలో ఉంటాడని రాయపాటి సాంబశివరావు అన్నారు. తాడికొండ సీటు తోకల రాజవర్ధన్ రావుకేనని ఆయన చెప్పారు.