Home / ANDHRAPRADESH / HIGH COURT: జీవో నంబరు 1 పై రాష్ట్ర హైకోర్టు ఇవాళ విచారణ
ap high court hearing go no1 chief justice comments

HIGH COURT: జీవో నంబరు 1 పై రాష్ట్ర హైకోర్టు ఇవాళ విచారణ

HIGH COURT: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు 1 పై రాష్ట్ర హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. వెకేషన్ బెంచ్ డిఫాక్టో చీఫ్ జస్టిస్ లా వ్యవహరించిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును స్వీకరించడం ద్వారా వెకేషన్ బెంచ్ తన పరిధిని మించి వ్యవహరించందన్నారు. ప్రతి కేసు ముఖ్యమైనదే అనుకుంటూ పోతే హైకోర్టు ఏమైపోవాలని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటివి జరిగితే ప్రతి వెకేషన్ జడ్జి…… చీఫ్ జస్టిస్ అయిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.

పిటిషన్ మూలాల్లోకి వెళ్లి చూస్తే అంత ఎమర్జెన్సీ కూడా అనిపించలేదనిఈ కేసు గురించి, దాని మూలాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నానని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. తమకేమీ తెలియదని అనుకోవద్దని….రిజిస్ట్రీ ఎప్పటికప్పుడు తనకు నివేదిస్తుందని తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన పూర్తి అధికారాలను వినియోగిస్తానని స్పష్టం చేశారు.

తన పిటిషన్ స్వీకరించాలంటూ వెకేషన్ కోర్టు ముందు ధర్నా జరిగిందా? అని ప్రశ్నించారు. అంత కంగారుగా వెకేషన్ బెంచ్ లో లంచ్ మోషన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఎలాంటి అత్యవసరం లేనప్పుడు లంచ్ మోషన్ వేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. జీవో నంబరు 1 పై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశంపై హైకోర్టు విచారణ చేపట్టింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat