CM JAGAN: దురుద్దేశంతోనే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పంచాయతీ, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేసి….కొత్త రోడ్లను నాణ్యతతో వేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని…..అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు.
ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుంటుందని సీఎం జగన్ అన్నారు. మొదటి దశలో వేయి కిలోమీటర్ల మేర ఎఫ్ డీ ఆర్ టెక్నాలజీతో చేపట్టాలని ఆదేశించారు. వచ్చే జూన్, జూలై కల్లా ఈ పద్ధతిలో నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేసి…..అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నాణ్యతపై దృష్టి పెడితేనే ఎలాంటి సమస్యలు రావని అన్నారు. రోడ్ల సమస్యలపై ఫిర్యాదులు వస్తే……60 రోజుల్లో పూర్తి చేయాలన్నారు.