తన ఇంట్లోకి అపరిత వ్యక్తి చొరబడిన సమయంలో తనను తాను రక్షించుకోవడంపై దృష్టి పెట్టినట్టుగా సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ చెప్పారు.రెండు రోజుల క్రితం సీనియర్ మహిళా ఐఎఎస్ అధికారి నివాసంలోకి మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసే ఆనంద్ కుమార్ రెడ్డి వెళ్లాడు . అర్ధరాత్రి పూట డిప్యూటీ తహసీల్దార్ వెళ్లిన ఘటన కలకలం రేపింది.
ఈ విషయమై ట్విట్టర్ వేదికగా స్మితా సభర్వాల్ స్పందించారు. తన ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడినట్టుగా చెప్పారు. ఆ రోజు రాత్రి తనకు బాధాకరమైన అనుభవం కలిగిందన్నారు. తనను రక్షించుకోవడంపై తాను దృష్టి పెట్టినట్టుగా చెప్పారు. మీరు ఎంత సురక్షితంగా ఉన్నారని భావించినా ఎల్లప్పుడూ తలుపులు, తాళాలను తనిఖీ చేసుకోవాలని ఆమె సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నెంబర్ కు డయల్ చేయాలని సూచించారు.
మేడ్చల్ జిల్లాలోని డిప్యూటీ తహసీల్దార్ గా పని చేస్తున్న ఆనంద్ కుమార్ రెడ్డి రెండు రోజుల క్రితం అర్ధరాత్రి సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ నివాసానికి వచ్చారు. అర్ధరాత్రి పూట తన నివాసానికి అపరిచిత వ్యక్తి రావడంపై ఆమె షాక్ కు గురయ్యారు. అపరిచిత వ్యక్తి అర్ధరాత్రి పూట తన నివాసానికి చేరుకోవడంపై ఆమె షాక్ కు గురయ్యారు. ఎవరని ఆమె అతడిని ప్రశ్నించారు.
తాను డిప్యూటీ తహసీల్దార్ చెప్పాడు. తన విధుల విషయంలో ఇబ్బందులున్నాయని ఐఎఎస్ అధికారికి చెప్పారు. ఈ విషయమై మాట్లాడేందుకు వచ్చినట్టుగా అతను చెప్పిన సమాధానం విన్న ఐఎఎస్ అధికారి అతనిపై మండిపడ్డారు. తన నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని పిలిచారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆనంద్ కుమార్ రెడ్డిని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆనంద్ కుమార్ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.