ఆటో కార్మికులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.. ఈసందర్బంగా ఖిలా వరంగల్ చమన్ ఆటో అడ్డా నూతన కమిటీ బృందం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే నరేందర్ ను మర్యాద పూర్వకంగా కలిసారు..అనంతరం కార్మికులు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల,ఫైనాన్స్ కంపెనీల వేధింపులు అరికట్టాలని,ఆటో అడ్డాలు ఏర్పాటు చేయాలనీ కోరారు..
అనంతరం కార్మికులను ఉద్దెశించి ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆటో కార్మికులు మరియు ట్రాఫిక్ పోలీస లతో మరియు ఆటో ఫైనాన్స్ వారితో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయించి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.
అలాగే అన్ని రంగాల కార్మికులతో, లేబర్ అధికారులతో జాయింట్ మీటింగ్ ఈనెల 25న రాజశ్రీ గార్డెన్ లో ఏర్పాటు చేశామని అందులో అన్ని రంగాల కార్మికుల సమస్యలు చర్చించి పరిష్కారం చేస్తామని అలాగే కార్మికులకు లేబర్ కార్డులు, ఇన్సూరెన్స్, తదితర లబ్ది అంశాల చర్చ ఉంటుందని కార్మిక సంఘాలు అన్ని పాల్గొనాలని కోరారు..ఈకార్యక్రమంలో BRSKV జిల్లా అధ్యక్షులు బోగి సురేష్, తాడు అధ్యక్షులు ఇమ్మడిశెట్టి రాజు, అడ్డా అధ్యక్షులు గద్దల బాబు, కార్యదర్శి ఎల్లగౌడ్, గొర్రె నరేష్, గద్దల అశోక్, ప్రవీణ్, మైదం శ్రీను, రాజు, శ్రీకర్, సతీష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు..