యాంకర్ రష్మీ గౌతమ్ నటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఇంట్లో విషాదం నెలకొంది.
రష్మీ గ్రాండ్ మదర్ నిన్న శుక్రవారం కన్నుమూసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో తనే స్వయంగా చెప్తూ భావోద్వేగపూరిత నోట్‌ను స్టోరీలో పెట్టింది.‘మా గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా ఈ రోజు కన్నుమూశారు.
ఆమె మరణంతో కుటుంబ సభ్యులమంతా శోకసంద్రంలో మునిగిపోయారు. బరువెక్కిన గుండెలతో ఆమెకు వీడ్కోలు పలికాం. తను చాలా స్ట్రాంగ్ మహిళ. మా అందరిపై ఆమె ప్రభావం ఉంటుంది.
మా నుంచి దూరమైనా.. ఆమె అందమైన జ్ణాపకాలు మాలో సంజీవంగా ఉన్నాయి. ఓం శాంతి’ అంటూ ఎమోషనల్ అయింది. దీనిపై పలువురు బుల్లితెర నటీనటులు రష్మీకకు స్టే స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.