స్టార్ హీరో ప్రభాస్ ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ప్రస్తుతం ‘సలార్’ అనే సినిమా చేస్తున్నారు. శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. ఈ మూవీ తర్వాత ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు సమాచారం.
‘రావనమ్’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తున్నది.విజువల్ ఎఫెక్టులకు ప్రాధాన్యత ఉండే ఈ సినిమా తెరపై ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుందట. అయితే ఈ కాంబో ప్రెస్టీజియస్ మూవీ వెంటనే మొదలయ్యే అవకాశాలు లేవు.
ప్రభాస్‌కు చేతిలో ఉన్న భారీ చిత్రాలే ఇందుకు కారణం. ఆయన ‘సలార్’కు తోడు ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’, మారుతి డైరెక్షన్ మూవీతో పాటు ‘ఆది పురుష్’ ప్యాచ్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఇక హైదరాబాద్‌లో తాజాగా ‘సలార్’ కొత్త షెడ్యూల్ మొదలైంది. ఇది పూర్తయిన తర్వాత ైక్లెమాక్స్ చిత్రీకరిస్తారు. సెప్టెంబర్ 28న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.