తన తొలి సినిమా ‘నీది నాది ఓకే కథ’తో తన ప్రతిభ ఏ స్థాయిదో అందరికి తెలిజేసిన దర్శకుడు వేణు ఊడుగుల. ఈ సినిమా గురించి ఎలాంటి ప్రమోషన్లు అంతగా చేయకపోవడంతో ఈ సినిమా కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది.
కానీ బోలెడన్ని ప్రశంసలు దక్కించుకుంది. ఎంతలా ఉంటే తన రెండో సినిమాకే సురేష్ ప్రొడక్షన్స్ నుండి కాల్ వచ్చేంతలా. ఇక సురేష్‌బాబు, చెరుకూరి సుధాకర్‌లతో కథ ఓకే చేయించుకుని రానా, సాయిపల్లవిలతో ‘విరాటపర్వం’ రూపొందించాడు.
వేణు ప్రతిభను ఒక్క డిజాస్టర్‌తో పోల్చలేమని సితార సంస్థ అవకాశం ఇచ్చిందని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ సంస్థ ఎక్కువగా యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తుంది. ఇదే క్రమంలో వేణుకు కూడా ఓ అవకాశం ఇచ్చిందని టాక్. అయితే ఈ సారి మాత్రం వేణు సామాజిక అంశాలు, సందేశాల జోలికి పోకుండా పక్కా కమర్షియల్ స్క్రిప్ట్‌తో రెడీ అయ్యాడట.