పామాయిల్ సాగుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. సత్తుపల్లి మండల పరిధిలోని రేగళ్లపాడు గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ నర్సరీలో సిద్ధంగా ఉన్న 2 లక్షల 50 వేల పామాయిల్ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు రైతులకు మొక్కలను పంపిణీ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పామాయిల్ సాగు ప్రోత్సహించేందుకు, ప్రత్యామ్నాయ పంటగా పామాయిల్ సాగును రైతులకు అందుబాటులోకి తీసుకొస్తూ ప్రోత్సాహకంగా అవసరాన్ని కనుగుణంగా మొక్కలను అందించేందుకు సరికొత్త పద్దతులతో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను సమకాల పరిస్థితుల్లో పెంచి రైతులకు అందజేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పామాయిల్ సాగుకు ప్రోత్సాహకంగా కనీస మద్దతు ధరను కల్పించాలని, స్వదేశంలోని పామయిల్ సాగు విస్తరణతో విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసిన అవసరం లేకుండా ఎంతో ఆదాయం చేకూరుతుందని అన్నారు.
రైతులను ప్రోత్సహిస్తూ అవసరమైన మొక్కలను అందించేందుకు విదేశాల నుండి మొక్కల దిగుమతుకు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ హక్కులను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పామాయిల్ సాగు విస్తీర్ణకు, ఉత్పత్తికి తగినట్లుగా రెండు అశ్వరావుపేట, అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలను టిఎస్ ఆయిల్ పేడ్ నెలకొల్పగా మరో 3వ ఫాక్టరీగా వెంసూరూ మండలంలోని కల్లూరుగూడెంలో 25 ఎకరాల్లో నూతన పామాయిల్ ఫ్యాక్టరీ కొరకు స్థల సేకరణ జరిగి నిర్మాణ పనులకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సంసిద్ధం చేస్తున్నట్ల తెలిపారు.