Home / POLITICS / CORPORATOR: బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ అరెస్టు
brs-corporator-arrested-in-land-grabbing-case

CORPORATOR: బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ అరెస్టు

CORPORATOR: వరంగల్ నగరంలో భూ కబ్జా చేశారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి ఖమ్మం జైలుకు తరలించారు.

హనుమకొండ కాకతీయ కాలనీ ఫేజ్ –2లో తమ పేరు మీద ఉన్న 200 గజాల స్థలాన్ని పలుమార్లు అడిగినట్లు బాధితులు తెలిపారు.

ఆ స్థలాన్ని కార్పొరేటర్ కు ఇచ్చేందుకు నిరాకరించామని అన్నారు. ఈ నెల 13న తన అనుచరులతో అక్కడికి వచ్చి కాంపౌండ్ వాల్ ను కూలగొట్టారని తెలిపారు. తమను బెదిరించారంటూ ఈ నెల 17న బాధితులు హనుమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. సీపీ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, అతని డ్రైవర్ పడాల కుమారస్వామిపై ఐపీసీ 427, 447, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను వైద్య పరీక్షల అనంతరం హనుమకొండ సెకండ్ జేఎఫ్ సీఎం ముందు హాజరు పరిచి, మేజిస్ట్రేట్ ఆదేశాలతో ఖమ్మం జైలుకు తరలించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat