Fire Accident twist: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో కీలక మలుపు తిరిగింది. డెక్కన్ స్పోర్ట్స్ దుకాణంలో మంటలు చెలరేగడానికి కారణం…విద్యుదాఘాతం కాదని విద్యుత్ శాఖ అధికారి తెలిపారు. విద్యుదాఘాతం వల్లే మంటలు చెలరేగాయన్న వార్తలను విద్యుత్ అధికారులు ఖండించారు. మంటలు వ్యాపించే సమయంలో మీటర్లలో విద్యుత్ సరఫరా ఉందని వెల్లడించారు. ఒక వేళ విద్యుదాఘాతమే జరిగి ఉంటే సబ్‌స్టేషన్‌లో ట్రిప్ అయ్యేదని….మీటర్లు, తీగలు పూర్తిగా కాలిపోయేవని వివరించారు. ఘటనకు సంబంధించి సమాచారం అందడంతో వెంటనే విద్యుత్ సరఫరా నిలిపేసినట్లు వివరించారు.
అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలికి వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు భవనాన్ని పరిశీలించారు. పొగ దట్టంగా భవనంలో ఐరన్ ర్యాక్‌లు ఏర్పాటు చేసి బట్టలు నిల్వచేసినట్లుగా అధికారులు గుర్తించారు.భావిస్తున్నారు. మరోవైపు గంటల తరబడి మంటలు కొనసాగడంతో భవనం పటిష్టతపై అనుమానాలు నెలకొన్నాయి. టెక్నికల్ సిబ్బంది భవనాన్ని పరిశీలించాక కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మంటలు వ్యాపించిన భవనంతో పాటు చుట్టుపక్కల ఉన్న భవనాల పటిష్టతను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు
అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ స్టోర్స్‌లో ముగ్గురు కార్మికులు చిక్కుకుపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంటలు చెలరేగిన సమయంలో 17 మంది భవనం నుంచి బయటకు వచ్చారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సామానులు తెచ్చేందుకు వెళ్లి ముగ్గురు లోపల చిక్కుకుపోయారని పేర్కొన్నారు. చిక్కుకుపోయిన కార్మికులు గుజరాత్‌కు చెందిన కార్మికులు జునైద్ (25), జహీర్ (22), వసీం (32)గా గుర్తించారు. భవనంలో చిక్కుకుపోయిన వారిలో ఒకరు మృతి చెందినట్లుగా సమాచారం. ప్రమాదం తర్వాత ముగ్గురు ఆచూకీ కనిపించకుండా పోయినట్లు తెలిపారు. అంతస్తులో కనిపించినట్లుగా సమాచారం. భవనం యజమాని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.