Kamareddy Master Plan: కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ నిలిపేస్తామని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం మేరకే బృహత్ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.
బృహత్ ప్రణాళిక అంశంపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టరేట్, అదనపు కలెక్టరేట్, కమిషనర్ పాల్గొన్నారు. కామారెడ్డిలో విలీనమైన గ్రామాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు. ప్రజల అభిప్రాయం మేరకే ప్లాన్ రూపొందిస్తామని పేర్కొన్నారు. రైతుల భూమి సేకరించే ఉద్దేశం లేదని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చెప్పారు.
కామారెడ్డి మున్సిపల్ కార్యవర్గం అత్యవసర సమావేశంలో బృహత్ ప్రణాళిక డ్రాఫ్ట్ ను రద్దు చేస్తూ కౌన్సిలర్లు తీర్మానాన్ని ఆమోదించారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా తాము రూపొందించింది కాదని కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ అన్నారు. మాస్టర్ ప్లాన్ పై ఉన్నతాధికారులకు తీర్మానం పంపుతామని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.