5 రోజుల వర్కింగ్ డేస్, పెన్షన్ అప్డేట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు, వేతన సవరణ డిమాండ్ల కోసం జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు.
దీంతో ఆ 2 రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. ఈనెల 26న రిపబ్లిక్ డే, 28న నాలుగో శనివారం, 29న ఆదివారం ఉండటంతో ఆ రోజుల్లో కూడా బ్యాంకులు తెరుచుకోవు. 26 నుంచి 31 మధ్య కేవలం 27న మాత్రమే బ్యాంక్స్ ఓపెన్ ఉంటాయి.