KTR: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెంచుతున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి 36,300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏడబ్ల్యూఎస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్‌లో అమెజాన్ ప్రకటించింది.
అమెజాన్ ప్రకటనను మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఏడబ్ల్యూఎస్ ప్రకటన సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తెలంగాణ పౌరులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇ–గవర్నెన్స్, హెల్త్ కేర్, పురపాలక కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు ఈ డేటా సెంటర్లను ఉపయోగిస్తామన్నారు. ఈ డేటా సెంటర్‌తో దేశంలోనే ప్రగతిశీల డేటా సెంటర్ హబ్‌గా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని చందన్‌వెల్లి, ఎఫ్ఏబీ సిటీ, ఫార్మా సిటీల్లోని డేటా సెంటర్లలో దశల వారీగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ పెట్టుబడులు పెట్టనుంది.