బోథ్ మండలానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు పంపిణీ చేశారు. అనంతరం గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పథకాలలో అభివృద్ధి లో దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుంది అని అన్నారు.
నాడు ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ నేడు స్వరాష్ట్రంలో దేశానికే దిక్సూచి గా నిలుస్తోంది అని అన్నారు. దేశంలో ఎక్కడ కూడా పేదింటి బిడ్డకి అండగా ఉండాలని ఆలోచన రాలేదని కేవలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కేసీఆర్ గారికి వచ్చిందని పేదింటి బిడ్డ పెళ్లికి రూ. 1,00,116/- లను అందిస్తూ తల్లి తండ్రికి ఇంటికి పెద్ద కొడుకై నిలిచారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మన్ సింగ్, వైస్ చైర్మన్ సంజీవ్ రెడ్డి, జడ్పీటిసి సంధ్యారాణి, వైస్ ఎంపిపి లింబాజి, సర్పంచ్ సురేందర్, కోఆప్షన్ సభ్యులు తాహెర్, ఎంపిటిసి నారాయణ రెడ్డి, ఎలుక రాజు, సుభాష్, రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.