తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని నిన్న కలెక్టర్ గారి కార్యాలయం ప్రారంభోత్సవంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రారంభించడం జరిగింది.
దానిలో భాగంగా ఈరోజు మధిర మున్సిపాలిటీలోని రెండవ వార్డులు కౌన్సిలర్ సయ్యద్ ఇక్బాల్ గారు, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు గ్రామీణ ప్రాంతాల వారు పేదవారు కంటి చూపు లేక ఆసుపత్రికి వెళ్లి చూయించుకునే ఆర్థిక స్తోమత లేక బాధపడుతున్నటువంటి వారికి కోసం వైద్యులు గ్రామానికి వెళ్లి కళ్ళు పరీక్ష చేసి సమస్యకు సంబంధించిన కళ్ళజోడు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని ప్రతి పేదవాడి బాధను అర్థం చేసుకొని వారికి ఎంత సంక్షేమ పథకాలు అందజేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, వైద్యులు అధికారులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.