కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని గణేష్ గ్రౌండ్ బస్తీ దవాఖాన వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరంను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి పరీక్ష చేసుకున్న వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేద, ధనిక, కులమతాల తేడా లేకుండా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా అద్దాలు, అవసరమైతే ఆపరేషన్లు సైతం ఉచితంగా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రతిష్ట, గౌరవం పెంచడంతో పాటు ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయన్నారు. ఈ చక్కటి పథకాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసి మంగతాయారు, ఈఈ కృష్ణ చైతన్య, డాక్టర్ శీరనాజ్, డిఈఈ పాపమ్మ, సూపర్వైజర్ రాజేశ్వరి మరియు నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, నాయకులు అడప శేషు, యూసుఫ్, నాగిరెడ్డి, రాజ్ కుమార్, ఇస్మాయిల్, పద్మజ రెడ్డి, పద్మలతా రెడ్డి, కటింగ్ శ్రీను, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.