తెలంగాణ రాష్ట్రంలో నిన్న బుధవారం జరిగిన ఖమ్మం బీఆర్‌ఎస్ బహిరంగ సభకు హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన ప్రసంగంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘సీఎం కేసీఆర్ మాకు పెద్దన్న లాంటోడు’ అని సంబోధించడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా నేర్చుకొన్నాం. కంటి వెలుగు, సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతమని ప్రకటించారు.
ఈ కార్యక్రమాలను ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని కేజ్రీవాల్ బహిరంగ సభలో స్పష్టం చేశారు. ఖమ్మం సభలో తన ప్రసంగం వీడియోను కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పోస్టు చేయగా, నిమిషాల్లోనే సుమారు 38 వేల మందిపైగా వీక్షించారు.