‘తిరు’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ధనుష్.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘సార్’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుసగా అప్డేట్లను ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ను చిత్రబృందం ప్రకటించింది.ఈ సినిమాలోని సెకండ్ సింగిల్‌ను జనవరి 17న రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేసింది. బంజారా అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన మాస్టారు పాటకు అనూహ్య స్పందన వచ్చింది. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తుంది. సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
The Wanderer is all set for a journey ?
The 2nd Single #NaadodiMannan (Tamil), #Banjara (Telugu) from #Vaathi/#SIRMovie drops on 17th Jan ?
A @gvprakash Musical ?@dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @vamsi84 @SitharaEnts @Fortune4Cinemas @adityamusic pic.twitter.com/ljlevPv80a
— Sithara Entertainments (@SitharaEnts) January 14, 2023