Home / MOVIES / క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ

క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ దేవబ్రాహ్మణ కులస్తులకు క్షమాపణలు చెప్పారు. పొరపాటు జరగిందని, తన వాళ్లను బాధ పెట్టకుంటానా అంటూ దేవబ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని వ్యాఖ్యానించారు. దీనిపై దేవ బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో స్పందించిన నందమూరి నటసింహం.. వారికి క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.‘దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణ బ్రహ్మ అని నాకు అందిన సమాచారం తప్పని తెలియజేసిన దేవ బ్రాహ్మణుల పెద్దలు అందరికీ కృతజ్ఞతలు. నేను అన్న మాటవల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను.

నాకు ఎవరినీ బాధపెట్టాలన్న ఆలోచనలేదని, ఉండదని తెలుగు ప్రజలు అందరికీ తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలవోకాగా వచ్చిన మాట మాత్రమే. సాటి సోదరుల మనసు గాయపరచడం వల్ల నాకు వచ్చే ప్రయోజం ఏం ఉంటుంది చెప్పండి?. దేవ బ్రాహ్మణులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. తన పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను’ అని ఆ లేఖలో బాలకృష్ణ పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat