Politics ప్రస్తుతం తెలంగాణకు సిఎస్ గా ఉన్న సోమేష్ కుమార్ ను ఏపీ క్యాడర్కు వెళ్లాల్సిందిగా తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రస్తుతం సీఎస్ ఎవరున్నారు అనే విషయం చర్చనీయాంసం గా మారింది..
ప్రస్తుతం తెలంగాణకు సిఎస్ గా సోమేశ్ కుమార్ ఉన్న సంగతి తెలిసిందే అయితే ఇతని ఏపీ కేడర్ కు వెళ్లాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా రెండు రోజుల్లో ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని కూడా తెలిపింది అయితే దీంతో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొత్త సిఎస్ గా ఎవరిని నియమిస్తుంది అనే విషయం తెరపైకి వచ్చింది..
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాల్లో ఆంధ్రా నాయకులు పలు కీలక స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో కొత్త సిఎస్ గా ఆంధ్రకు చెందిన వ్యక్తులు రావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే సీఎస్ రేసులో రామకృష్ణారావు, అరవింద్ కుమార్ ఉన్నారు. అలాగే రామకృష్ణారావు ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకటిని సీఎస్‌ను నియమించే అవకాశముండగా.. ఎక్కువ శాతం రామకృష్ణారావుకే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది ఈ నెల 12వ తేదీన ఆంధ్రకు రిపోర్ట్ చేయవలసిందిగా హైకోర్టు సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేయగా ఆ తర్వాతే ఎవరు వస్తారు అనే విషయం తెలిసేలా ఉంది.