తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల లో సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ సమక్షంలో సెస్ నూతన చైర్మన్గా చిక్కాల రామారావు, వైస్ చైర్మన్గా దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు ప్రమాణం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ వారిని శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేసి, అభినందించారు. అంతకు ముందు తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కేటీఆర్ విష్కరించారు. అనంతరం మండల ప్రజాపరిషత్ భవనాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్, తెలంగాణ పవర్లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్లు జిందం కళా చక్రపాణి, రామతీర్థపు మాధవి, సెస్ ఎండీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.