తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ క్రీడా , పర్యాటక , సాంస్కృతిక, వారసత్వ శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి 2 నుండి 5 వరకు జరుగుతున్న 5వ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ – 2023 నిర్వాహణ పై రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ లో 15 వేల మంది మాస్టర్స్ ఆథ్లెట్ లు, 18 రకాల క్రీడలు, 27 రాష్ట్రాల నుంచి మాస్టర్స్ క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ గేమ్స్ అంతర్జాతీయ స్థాయిలో 4 రోజుల పాటు జరుగుతున్న ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ను నిర్వహిస్తున్న నిర్వహకులను అభినందించారు మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్.
ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ ఛైర్మన్ కొలన్ జగదీశ్వర్ రెడ్డి, Y. రామారావు కార్యదర్శి, ఉపాధ్యక్షులు అనూప్ చక్రవర్తి, ఉపాధ్యక్షుడు/ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఓర్సు రమేష్ లు పాల్గొన్నారు.