తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన సంగతి విదితమే. ఈ సందర్భంగా జాతీయ పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో ప్రారంభించిన సంగతి విదితమే.
ఈ క్రమంలో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభ వేదికను.. తారీఖును ఖరారు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది.
అదే రోజున కంటివెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ముగ్గురు ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.