Politics తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయంపై పలువురు నేతలు పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకొని టిడిపికి సహకరిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయంపై స్పందించారు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు..
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తాజాగా పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తేనే ఆయనకు 100 కోట్లు వస్తాయని అలాంటిది డబ్బులు కోసం వేరే పార్టీలోకి మారాల్సిన అవసరం అతనికి ఏంటి అంటూ చెప్పుకొచ్చారు.. అలాగే ఈ సందర్భంగా మాట్లాడిన రఘురామా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసెన పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు.. అలాగే జగన్ సర్కారు తీసుకొచ్చిన జీవో నంబర్ 1 రాజ్యాంగ విరుద్ధమని, ఎవరైనా కోర్టుకు వెళ్తే ఈ జీవోను కొట్టేస్తారని తెలిపారు. అలాగే చంద్రబాబు నాయుడు దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారని అలాంటిది ఆయన తన సొంత నియోజకవర్గానికి పర్యటనకు వెళితే ఆపడం ఏంటని అన్నారు రాజ్యాంగ విరుద్ధమైన జీవోలతో ప్రతిపక్ష పార్టీలను అణచివేసే పద్ధతి ఇంతకుముందు ఎక్కడా కూడా కనిపించలేదని కానీ ఇలా చేయడం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదని అన్నారు.. అలాగే టిడిపి జనసేన రెండిట్లో ఏ పార్టీ నాయకుడు అధికారంలోకి వచ్చిన ఒకటేనని ప్రజలు వారిని తప్పకుండా ఆదరిస్తారని చెప్పుకొచ్చారు