కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జున డ్రీమ్ ల్యాండ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరాను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మంచినీటి సరఫరాను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రతీ ప్రాంతంలో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి ఫ్లై ఓవర్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సువర్ణ, సూర్యకల, రాజిరెడ్డి, మాజీ ఎంపిపి సన్న కవిత శ్రీశైలం యాదవ్, కోఆప్షన్ మెంబర్ వెంకటేష్, కొంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవేందర్ యాదవ్, లక్ష్మణ్, జనార్ధన్ మరియు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆకుల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, జనరల్ సెక్రెటరీ నాగ్ పాల్, ట్రెజరర్ పల్లవి జా, జాయింట్ సెక్రటరీ దేవిన గుప్త, సంతోష్ కుమార్ పాత్ర, కాలనీ వాసులు పాల్గొన్నారు.