తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక వసతులతో హోల్‌సేల్ చేపల మార్కెట్ ను నిర్మించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సుమారు రూ.50 కోట్లతో 10 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ నిర్మాణం చేపడతామన్నారు. హోల్‌సేల్, రిటైల్ మారెట్‌తో పాటు కోల్డ్ స్టోరేజ్, క్యాంటీన్ వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ, పశు గణాభివృద్ధి శాఖలపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నీటి వనరులు భారీగా అందుబాటులోకి వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ ఆశయాల మేరకు ప్రతి నీటి వనరులో చేపపిల్లలను వదలడంతో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందన్నారు.
ఈ దశలో చేపలను తకువ ధరకు అమ్ముకొని మత్స్యకారులు నష్టపోకుండా మారెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. హోల్‌సేల్ మారెట్ అందుబాటులోకి వస్తే చేపలకు మంచి ధర లభిస్తుందని చెప్పారు. మార్కెట్ నిర్మాణానికి ఇతర రాష్ట్రాల్లోని మారెట్లను అధ్యయనం చేయాలని మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను మంత్రి ఆదేశించారు. మత్స్యకారుల సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అర్హులైన మత్స్యకారులకు సిల్ టెస్ట్‌లో అవసరమైన శిక్షణ ఇవ్వాలన్నారు.