భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం, సర్వమతాల సమ్మేళనం. మన దేశంలో సహజ వనరులకు కొదువ లేదు. కానీ వాటిని సమర్థవంతంగా వినియోగించుకునే పాలకులే కరువు అవడం విషాదం. వనరులను ఉపయోగించి సంపద సృష్టిస్తూ, పెట్టుబడులు సాధిస్తే ఈ దేశ యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ, అలా జరగడం లేదు. తద్వారా మన యువత శక్తిసామర్థ్యాలను విదేశాలు ఉపయోగించుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ప్రధాని అయ్యాక ఆ మాట తప్పడం. కేంద్రం ఉద్యోగాలు ఇవ్వకపోగా యువతలో మతం పేరిట విద్వేషాలు నింపుతూ తప్పుదోవ పట్టిస్తుండటం అత్యంత బాధాకరం.
ఇప్పుడు మన తెలంగాణ రాష్ర్టానికి వద్దాం. స్వరాష్ట్ర సాధన కోసం పిడికి బిగించిన నాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ నినాదం ‘నీళ్ళు, నిధులు, నియామకాలు’. చుట్టూ నీళ్లు న్నా.. చుక్క నీరు పారక భూములన్నీ బీళ్లుగా మారాయి. అవే భూములు నేడు కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు, కాలువలు, చెరువుల పునరుద్ధరణతో పచ్చగా కళకళలాడుతున్నాయి. 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు పేర ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయంతో రాష్ట్రంలో పుష్కలమైన పంటలు పండుతున్నాయి.
ఇక ‘నిధుల’ విషయానికి వస్తే.. ఉమ్మడి పాలనలో ఒక్క రూపాయి కూడా ఇవ్వమన్న అసెంబ్లీలో నేడు సుమారు 2 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటున్నాం. ఇది గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. నాడు వచ్చీరాని కరెంట్‌తో, నీళ్లు లేక, అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు నేడు అప్పులు ఇచ్చే స్థాయికి చేరుకున్నారు. మన నీళ్లు, మన నిధులు మనకు రావటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంపద సృష్టిస్తూ రైతులకు, పేదలకు పథకాల రూపంలో పంచుతున్నారు. అందువల్లే తెలంగాణలో ఇంతటి ప్రగతి సాధ్యమైంది. దేశానికి రోల్ మాడల్‌గా ఎదిగింది.
ఇక మూడవ లక్ష్యం.. ‘నియామకాలు’. యువతకు ఉద్యోగాల కల్పన. ప్రభుత్వ ఉద్యోగం చదువుకున్న ప్రతీ విద్యార్థి కల. కానీ ఆ కల అందరికీ నెరవేరదు. ప్రభుత్వ ఉద్యోగం అందరికీ ఇవ్వడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. కానీ రాష్ట్ర ప్రభు త్వం తన పరిధిలో అవకాశం ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తూనే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేసింది. రాష్ట్రంలో అర్హులైన లక్ష మందిలో సగటున 1,643 మందికి ఉద్యోగాలు లభించాయి. ఉద్యోగ కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ముందువరుసలో ఉన్నది. సుమారు తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2 లక్షల పైచిలుకు ఉద్యోగాలు అందించింది. ఇవికాకుండా పెట్టుబడులను ఆహ్వానించి పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నది. ప్రైవేటురంగంలో పరిశ్రమల స్థాపన ద్వారా సుమారు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం. ‘నీళ్లు, నిధులతో పాటు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష అయిన నియామకాల కల కూడా నిజం చేస్తున్నా రు ముఖ్యమంత్రి కేసీఆర్.
విషాదమేమంటే.. ఇవేం పట్టని విద్వేష మూక లు నిరుద్యోగం అంటూ యువతను రెచ్చగొడుతున్నాయి. తాము రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు యువతను వాడుకోజూడటం అత్యంత బాధాకరం. రాష్ట్రంలో బీజేపీ అవలంబిస్తున్న విధా నం ఇదే. కానీ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగుల సంఖ్య పెరిగిందనే విషయం రాష్ట్ర బీజేపీ నాయకులు మరిచిపోవడం సిగ్గుచేటు. దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామంటూ బీరా లు పలికిన కేంద్రం అవి ఇవ్వకపోగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి ఉద్యోగులను రోడ్డుపాలు చేస్తున్నది. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లతో ఉద్యోగ కల్పనకు కృషి చేస్తుంటే అది ఓర్వలేని బీజేపీ సంస్కారహీనంగా వ్యవహరిస్తున్నది. ‘బీజేపీ నుంచి యువతను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. ఇది కుట్రలో భాగం’ అంటున్న బండి సంజ య్ వ్యాఖ్యలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయి.
కానీ ఆయన మాత్రం ‘నవ్విపోదురుగాక నాకే టి సిగ్గు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంటే యువతకు ఉద్యోగాలు రావటం బీజేపీకి ఇష్టం లేదా? యువత కేవలం రాజకీయపార్టీలు వాడుకోవటానికే పనికొస్తదా? అసలు అతని మాటల్లో ఆంతర్యమేంటి? ఒక్కసారి యువత ఆలోచించాలి. ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు కృషిచేస్తుంటే అభినందించాల్సింది పోయి, విమర్శలు చేయడం సిగ్గుచేటు. దీనివెనుక ఉన్న కుట్రను యువత అర్థం చేసుకోవాలి.
దేశాభివృద్ధిపై నిత్యం చర్చ జరగాలి. దేశ భవిష్యత్‌పై చర్చ జరగాలి. అంతేకానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలతో రచ్చ చేస్తున్నది. యువతను అటువైపు ఉసిగొల్పి వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నది. దేశంలో నైపుణ్యం గల యువతకు కొదువలేదు. అందుకే విదేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలకే మనవాళ్లు సీఈఓలుగా ఉంటున్నా రు. అంతటి ప్రతిభ ఉన్న యువతను కేంద్ర ప్రభు త్వం గుర్తించకపోవడం హేయనీయం. యువత తమ విజ్ఞానంతో విజయా లు సాధించాలని ఆకాంక్షించేవారిలో మన ముఖ్యమం త్రి కేసీఆర్ ముందుంటారు. అందుకోసమే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చేసి ఈ దేశా న్ని విజయవంతంగా ముం దుకునడిపేందుకు అడుగులు వేశారు. తెలంగాణ మాదిరిగానే దేశమంతా ఉద్యోగాల జాతర సాగాలంటే కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. యువత భవిష్యత్తు కోసం నిత్యం పరితపించే బీఆర్‌ఎస్ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే అందరూ ఉండాలి. నిన్న రాష్ర్టాన్ని గెలిపించిన కేసీఆర్, రేపు దేశాన్ని గెలిపిస్తారనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
ప్రధాన నియామక సంస్థల నోటిఫికేషన్లు
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – 18,263 ఉద్యోగాలు
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్‌రిక్రూట్‌మెంట్ బోర్డు – 17,516 ఉద్యోగాలు
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు – 7,320 ఉద్యోగాలు
గురుకులాల్లో – 11,687 ఉద్యోగాలు
వివిధ దశల్లో ఉన్నవి – 25,253 ఉద్యోగాలు
మొత్తం ఉద్యోగాలు – 80,039
– తెలంగాణ విజయ్,
94919 98702
హరిశన్న 🔥🔥