Politics ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ జూదయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ..
ఉత్తరాది రాష్ట్రాల్లో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని దేమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.. అలాగే బిజెపి ప్రభుత్వం ప్రతిసారి టార్గెట్ చేస్తుందని కానీ తాను మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నాను అంటూ చెప్పవచ్చు అలాగే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని అప్పుడు బిజెపికి సమాధానం చెప్తామంటూ చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ…
ప్రస్తుతం రాహుల్ చేపట్టిన భారత జూడయాత్రకు దేశవ్యాప్తంగా విశేష స్పందన వస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఇతని యాత్ర హర్యానాలను కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్.. ‘కేరళలో భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పుడు విశేష స్పందన వచ్చింది. కానీ బీజేపీ పాలిత కర్ణాటకలో ఆదరణ ఉండదని అన్నారు. కానీ కన్నడ నాట ఇంకా ఎక్కువ మంది యాత్రకు తరలివచ్చారు. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల నుంచి మహారాష్ట్రలో అడుగుపెట్టినప్పుడు అక్కడ యాత్ర ఫెయిల్ అవుతుందని అన్నారు. కానీ జనం ఇంకా భారీగా తరలివచ్చారు. ఇక బీజేపీ అధికారంలో ఉన్న హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల్లో యాత్రను ఆదరించరని అన్నారు. కానీ దక్షిణాది కంటే ఎక్కువ ఆదరణ ఇక్కడే లభిస్తోంది. ఈసారి కచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. యూపీ, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు’ అని రాహుల్ అన్నారు.