తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జంట నగరాల నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ యేడాది 4,233 అదనపు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ శ్రీధర్ నిన్న శనివారం తెలిపారు.
ఎంజీబీఎస్‌లో సంక్రాంతి సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంతో పాటు అంతరాష్ట్ర బస్సులలో అదనపు చార్జీలకు మినహాయింపు ఇచ్చారు. సాధారణ రోజులలో ఉండే చార్జీలతోనే ఆర్టీసీలో సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించ వచ్చని ఆయన చెప్పారు.
ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ర్టాలకు అదనపు బస్సులను నడపడానికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించామని వెల్లడించారు.