కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి వద్ద హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫ్లైఓవర్ మరియు రోడ్డు వెడల్పు పనులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, కమిషనర్ వంశీకృష్ణ గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారు మరియు హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు చేపడుతున్న ఫ్లైఓవర్, రోడ్డు వెడల్పు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా టిఎస్ఎస్పిడిసిఎల్, టౌన్ ప్లానింగ్, హెచ్ఎండిఏ అధికారులు సమన్వయంతో ముందుకు సాగి పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ ఎస్ఈ యూసుఫ్ హుస్సేన్, డిఈఈ వేణు గోపాల్, ఎలక్ట్రికల్ ఈఈ నవీన్ కుమార్, ఏఈఈ రమేష్, టిఎస్ఎస్పిడిసిఎల్ కన్స్ట్రక్షన్ డిఈ శ్రీదేవి, ఏడిఈ గాయత్రి మరియు ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్ మరియు స్థానిక కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.