కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు నోబుల్ ఎంక్లేవ్ కాలనీలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారు, కమిషనర్ శ్రీహరి గారు మరియు కౌన్సిలర్ సన్న రవి యాదవ్ గారితో కలిసి పర్యటించారు.
ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానికంగా నెలకొన్న రోడ్డు ప్యాచ్ వర్క్, కమిటీ హాల్ నిర్మాణానికి నిధులు, వర్షపునీటి కాలువ నిర్మాణం, పార్క్ స్థలంకు అదనంగా అందుబాటులో ఉన్న కొంత స్థలం కేటాయించేలా కృషి చేయాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి అక్కడే ఉన్న అధికారులకు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కోఆప్షన్ సభ్యుడు వెంకటేష్, డిఈఈ చిరంజీవి, సీనియర్ నాయకుడు దేవేందర్ యాదవ్, కాలనీ వాసులు చంద్రశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.