ఐనవోలు మల్లికార్జున స్వామి వార్లను ఈ రోజు గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే,వరంగల్ జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీ అరూరి రమేష్ గారు దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు.
వీరికి శాలువా తో సత్కరించి వేదపండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ సన్నిధి లో దాతలు నిర్మాణం చేసిన నిత్యాన్నదాన సత్రం,మల్లన్న సధన్ వసతి గృహాలు మరియు కుళాయిల ను ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ నెల13 వ తారీఖు నుండి జరిగే జాతర ఏర్పాట్లలో భక్తులకు అన్ని సౌకర్యాలు పూర్తి చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములు,ఎంపీపీ శ్రీమతి మధుమతి రవీందర్ రావు,ఆలయ ఈఓ నాగేశ్వరరావు,రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు శ్రీమతి ఎల్లావుల లలితా యాదవ్,వైస్ ఎంపీపీ తంపుల మోహన్ ,నందనం సొసైటీ వైస్ చైర్మన్ చందర్ రావు,మండల కో ఆప్షన్ గుంశావలి,దేవస్థానం మాజీ చైర్మన్ మునిగాల సమ్మయ్య,మండల పార్టీ అధ్యక్షులు పోలేపల్లి శంకర్ రెడ్డి, ప్రధానకార్యదర్శి బుర్ర రాజశేఖర్, మండల ఎస్సి సెల్ ,ఎస్టీ సెల్,బీసీ సెల్ అధ్యక్షులు దుప్పెల్లి కొమురయ్య,పల్లంకొండ సురేష్,విజయ్ భాస్కర్,రైతు సంఘం అధ్యక్షులు రాఘవులు,మండల యూత్ అధ్యక్షులు మరుపట్ల నరేష్ ,సోషల్ మీడియా ఇంచార్జీ గూబ అరుణ్ కుమార్,స్ధానిక సర్పంచ్ జన్ను కుమార స్వామి,ఎంపీటీసీ కల్పన మధుకర్,ఉపసర్పంచ్ సతీష్,గ్రామ పార్టీ అధ్యక్షులు పరమేష్ గౌడ్,తెరాస నాయకులు తండా వెంకన్న,బైరీ వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు..