కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్టకు చెందిన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు తన నివాసం వద్ద సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, బేతి గోపాల్, జనార్ధన్, హరినారాయణ, జల్దా లక్ష్మీనాథ్, తుమ్మ నవీన్, బాలాజీ, ప్రభాకర్, జైరాములు, సాయిలు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.