Politics ఈ రోజుల్లో జర్నలిజం అంటే ఏంటో కూడా తెలియకుండానే కొందరు న్యూస్ రాస్తున్నారని మరికొందరు కేవలం వారి స్వార్థం కోసమే న్యూస్ ఛానల్లో నడుపుతున్నారు అంట చెప్పుకోచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు..
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తాజాగా జర్నలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఈయన కొందరు జర్నలిజం విలువకు తిలోదకాలు ఇస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు అలాగే జర్నలిజం అంటే కూడా ఏంటో తెలియకుండానే న్యూస్ను నడిపేస్తున్నారు అంటూ తెలిపారు.. జర్నలిజం అంటే ఎప్పుడు కూడా ప్రజలకు సరైన న్యూస్ నే అందించాలని కానీ ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలుకుతూ రాయటం ఎంత మాత్రం సరికాదని అన్నారు విలువ లేని రాతలన్నీ కూడా తప్పుడు జర్నలిజానికి నిదర్శనమని అన్నారు.. అలాగే రోజు రోజుకు ఇలాంటి న్యూస్ చదివే జనాలు అసలు జర్నలిజం అంటే విలువ పోతుందని న్యూస్ ఛానల్ నమ్మే పరిస్థితి కూడా దూరమవుతుందని అన్నారు ఎవరు స్వార్థం కోసం వాళ్ళు నచ్చినట్టు న్యూస్ రాసుకుంటూ వెళుతుంటే చివరకు ఏమవుతుందంటూ ప్రశ్నించారు..
అలాగే కొందరు జర్నలిజం తో పాటు చట్టాన్ని న్యాయాన్ని సైతం తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని అన్నారు అంతే కాకుండా ఈ సందర్భంగా కొందరు.. కరోనా సమయంలో చనిపోయిన జర్నలిస్టులకు సాయం, అక్రిడేషన్ కార్డుల గురించి ప్రశ్నించారు. అయితే ఈ విషయాలను మాత్రం ఈయన చెప్పకుండా దాటివేశారు ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ ముందుకు సాగిపోయారు..