Politics మోడీ ప్రభుత్వం తాజాగా ఒకేలకు నిర్ణయాన్ని తీసుకుంది ఇప్పటికే ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు మొదలు పెడుతూ వస్తున్న కేంద్రం మరొకసారి పేదల కోసం ఓ నిర్ణయాన్ని తీసుకుంది.. ఉచితంగా టీవీ ప్రసారం మాధ్యమాలను అందించాలని అనుకున్నట్లు తెలుస్తుంది..
ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా పార్లమెంట్ సమావేశంలో నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రస్తుతం ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నారు అయితే దీంతోపాటు ఉచితంగా టీవీ ప్రసారం మాధ్యమాలను కూడా అందించాలని అనుకున్నట్లు తెలుస్తుంది.. అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు మోదీ సర్కార్ ఈ పెద్ద నిర్ణయం తీసుకునట్లు సమచారం. దేశంలో పబ్లిక్ సెక్టార్ ప్రసారాలను పెంచడానికి సెంట్రల్ స్కీమ్‌కు ఆమోదం తెలుపుతూ.. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆల్ ఇండియా రేడియో FM ఛానెల్‌ల కవరేజీని 80 శాతానికి పైగా జనాభాకు విస్తరించాలని, 8 లక్షల డీడీ ఉచిత డిష్ డీటీహెచ్‌ను పంపిణీ చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సెట్-టాప్ బాక్స్‌లు అందించాలని నిర్ణయించింది.
అలాగే ఇందుకోసం దాదాపు ఇలా 2500 కోట్లు కేంద్రం ఖర్చు పెట్టాన ఉందని సమాచారం అలాగే గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాలు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు కూడా ఈ లాభాన్ని పొందుతాయని తెలిపింది అలాగే ఈ సందర్భంగా ఏడు లక్షల మందికి డిష్ టీవీలను పంపిణీ చేయనున్నట్టు కూడా తెలుస్తోంది.. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎప్పటినుంచి అమలు అవుతుందో ఇంకా తెలియాల్సి ఉంది అలాగే దీనిపై పూర్తి వివరణ రావాల్సి ఉంది..