Politics దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది అయితే ఈ ఆలయం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని ముందే చెప్పేశారు అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చేయాడాది జనవరి ఒకటికల్లా ఆలయం మొదలైపోతుందని తెలిపారు అలాగే అప్పటినుంచి భక్తులు దర్శనానికి రావచ్చని కూడా తెలిపారు..
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అనూష తాజాగా ఒక శుభవార్త ప్రకటించారు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అయోధ్య రామాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు… అంటే అప్పటినుంచి రాముడు దర్శనం అర్థమవుతుందని తెలుస్తోంది..
అలాగే ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా ఇందుకోసం ఎన్నో ఏళ్లగా ఎదురుచూసామని తెలిపారు అలాగే కొన్ని కోట్ల మంది హిందువుల కల నెరవేరబోతుందని అన్నారు.. ఇందుకోసం కేసు కోర్టులో ఎన్నో ఏళ్ళు నడిచిందని ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారని గుర్తు చేశారు అలాగే కోర్టులో అనుమతి రావడంతో ప్రధాన మోడీ ఆలయాన్ని మొదలుపెట్టారని మరొకసారి గుర్తు చేశారు.. అలాగే
‘‘రాహుల్ బాబా విను.. 2024 జనవరి 1 నాటికి అయోధ్యలోని రామ మందిరం సిద్ధం అవుతుంది’’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి హోం మంత్రి వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్న ప్రదేశాన్ని శ్రీరాముని జన్మస్థలంగా హిందువులు భావిస్తారు ఇక్కడ ఒకప్పుడు రామాలయం ఉండేదని కానీ దాన్ని 16వ శతాబ్దంలో కూల్చి మసీదు నిర్మించారని ఒక నమ్మకం… 500 ఏళ్ల చరిత్ర ఉన్న బాబ్రీ మసీదు 1992లో కూల్చివేతకు గురైంది. అప్పటి నుంచి ఈ స్థలం ఎవరికి చెందుతుందనే విషయమై వివాదం నడిచింది. అయితే 2019 నవంబర్ 9న ఈ వివాదం పై సుప్రీంకోర్టు తుది తీర్పును ఇచ్చింది ఈ స్థలంలో రామాలయం కట్టుకోవడానికి అనుమతి ఇవ్వటంతో ప్రధాని నరేంద్ర మోడీ 2020 ఆగస్టు ఐదున భూమి పూజ చేసి ఈ ఆలయం నిర్మాణాన్ని చేపట్టారు..