Politics బిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్మాత నటుడు బండ్ల గణేష్ ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రంజిత్ రెడ్డి లేకపోతే తాను లేనని ఈ పాటకి ఎప్పుడు చనిపోయే వాడిని అంటూ తెలిపారు అలాగే తాను ఏ పార్టీలోనే లేకపోయినప్పటికీ రంజిత్ రెడ్డి వెనుక మాత్రం ఉంటాను అంటూ తెలిపారు..
ఈ రోజు బీఅర్ ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నరేష్ ఇతని కోసమే రాజకీయాలు వదిలేసాను అంటూ చెప్పుకొచ్చారు అలాగే తన లేకపోతే నేనులేను అంటూ పొగడ్తలు వర్షం కురిపించారు ఈ సందర్భంగా అతని కాలికి మొక్కారు..
బండ్ల గణేష్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరినా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేపథ్యంలో రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్న ఇతను.. రంజిత్ రెడ్డి అన్న లేకపోతే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునే వాడినని.. నా అన్న, నా దేవుడు, ఆయన కోసమే రాజకీయాలను వదిలేసి రంజిత్ అన్న వెనక నిలబడ్డారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి కాళ్లు మొక్కారు గణేష్. తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేను అంటూనే రంజిత్ రెడ్డి వెనుక ఉన్నానని ప్రకటించారు. అలాగే ముందు ముందు మళ్ళీ పార్టీలు మారాలని ఆలోచన కానీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన కానీ లేదని ఇలాగే జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నానంటే తెలిపారు..