Home / SLIDER / తెలంగాణలోని ప్రతి పల్లె ముఖరా కె కావాలి

తెలంగాణలోని ప్రతి పల్లె ముఖరా కె కావాలి

తెలంగాణలోని ప్రతి పల్లె ముఖరా కె కావాలని, ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేసుకుని, స్వయం సమృది బాటలో తెలంగాణ పల్లెలు పయనించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రామంలో సేకరించిన చెత్త తో తయారు చేసిన వర్మికంపోస్టుతో వచ్చిన అదాయం నుంచి లక్ష రుపాయలను ముఖ్యమంత్రి సహాయనిదికి ఇవ్వడం అద్భుతమని సీఎం అన్నారు.

సోమవారం సీఎం ను కలిసిన ముక్రాకె గ్రామ సర్పంచ్, గ్రామస్తులు సీఎం సహాయ నిధికి లక్ష రూపాయల చెక్కునందించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…తెలంగాణ పల్లెలు ప్రగతి ప్రస్థానంలో సాగుతున్నాయని, గ్రామాలొ పల్లె ప్రగతి ఫలాలు కనిపిస్తున్నాయని, స్వయం సమృద్ధి దిశగా అడుగులు వెస్తున్నాయనడానికి ముఖరా కె గ్రామం ఉదాహారణగా నిలిచిందన్నారు. గ్రామంలో సేకరించిన తడిచెత్త ద్వారా వర్మికంపొస్ట్ తయారు చెసి 7 లక్షలు అదాయాని సంపాదించడం అద్భుతమన్నారు. అందులోంచి ముఖరా కె సర్పంచ్ లక్ష రుపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వడం అభినందనీయమన్నారు.

గ్రామానికి వచ్చిన అదాయం నుంచి రూ.4 లక్షలతో సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేసి కరెంట్ ఉత్పత్తి చెస్తున్నామని, 2 లక్షల రూపాయలతో డిజిటల్ లైబ్రరి ఏర్పాటు చేసామని, 1 లక్ష రుపాయలు సీఎం సహాయనిధికి ఇస్తున్నామని ఈ సందర్భంగా సర్పంచ్ సీఎం కు వివరించారు.కాగా…ముఖరా కె గ్రామంలో లక్ష మొక్కలు నాటి 100% రక్షించడం ద్వారా ఈ గ్రామం దేశానికే అదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కోసం పని చేస్తున్న సర్పంచ్ శ్రీమతి గాడ్గె మీనాక్షిని గ్రామ క్రమిటీని గ్రామస్తులను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా గ్రామంలో తయారు చెసిన వర్మికంపొస్టు ప్యాకెట్ ను ముఖ్యమంత్రికి సర్పంచ్ మీనాక్షి అందించారు. ఈ సదర్భంగా మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంపిటిసి శ్రీ గాడ్గె సుభాష్ తదితరులున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat