సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం అనేక మహిళా కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే మహిళల వికాసం జరుగుతుందని నమ్మి, తొలి ఉపాధ్యాయురాలుగా విద్యను బోధించారని గుర్తు చేశారు. మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి, దళిత, బహుజన స్త్రీ జనోద్దరణ కోసం తన జీవితాంతం కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి అని అన్నారు.
