Politics ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రభుత్వం వైసీపీ పై వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ రామనారాయణరెడ్డి వరుసగా చేస్తున్న కామెంట్లపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్టు సమాచారం ఈ నేపథ్యంలో అతన్ని పదవి నుంచి తొలగించనున్నారని తెలుస్తుంది..
వైసిపి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అధికార ప్రభుత్వంపై వరుసగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తోంది అంతేకాకుండా ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆయన్ను తొలగించనున్నట్టు కూడా తెలుస్తోంది ఈ స్థానంలో తిరుపతి జిల్లా అధ్యక్షుడు మాజీ సీఎం నేదురుమల్లి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని నియమించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఏడాదిలోపు ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని విషయంపై ఆనం రామనారాయణరెడ్డి అన్న విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 లోనే ఎన్నికలు వస్తాయని చెప్తే ఆనం మాత్రం ముందు వస్తాయని ఎలా అంటున్నారు అంటూ ప్రశ్నిస్తుంది..
ఇప్పటికే ఆంధ్రలో ఉన్న పలువురు వైసిపి నేతలు అంతా ఆనంపై గురుగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఈ విషయంపై అధినేత జగన్ చెప్పని విషయం ఆనం ఎలా చెప్పారు అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.. అలాగే ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో చేసిందని వాటన్నిటిని మరిచిపోయి ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని అన్నారు అలాగే రోడ్లు బాగా చేయించిందని ప్రజల కోసం అయినా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందని వీటన్నిటిని మరిచిపోయి ముందస్తు ఎన్నికలు వస్తాయి అంటూ సెటైర్లు వేస్తే ఎలా అవుతుంది అంటూ వీరంతా మండిపడుతున్నారు..