దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 1,51,186 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 134 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,78,956కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,582 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,707కి చేరింది.ఇంటర్ తర్వాత మహిళలు విద్య మానేయకుండా కొనసాగించేందుకు 53 డిగ్రీ కాలేజీలు ప్రారంభించిందని వెల్లడించారు. మహిళల పేరుపై ఇండ్ల మంజూరు, పట్టాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, న్యూట్రిషన్ కిట్స్, కేసీఆర్ కిట్స్ అందజేస్తుందని వివరించారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను ఆచరణలో అమలు చేస్తూ ఆమెకు నిజమైన నివాళులు తెలంగాణ ప్రభుత్వం అర్పిస్తుందని అన్నారు.
