తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు.
దీంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంత్రి హరీశ్ రావు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. స్వామివారికి స్వర్ణ కిరీటం సమర్పించారు. అనంతరం వెంకటేశ్వరునికి ప్రత్యేకపూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం, స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పణ. pic.twitter.com/bMNUleAb8e
— Harish Rao Thanneeru (@trsharish) January 2, 2023